శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటరమణ కాలనీ ( గోకుల్ ప్లాట్స్ ) లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కు డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి పని దినాల్లో ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) అందించే కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యులు మరియు పి ఏ సి చైర్మన్ అరికేపూడి గాంధీ బుధవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఈ రకంగా అల్పాహారం పెట్టడానికి డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వారు ముందుకు రావడం చాలా అభిందనీయమన్నారు. పిల్లలు ఉదయం పూట ఇంటిదగ్గర తినకుండా రావడంతో ఆకలితో స్కూలుకి వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగ్గా వినకుండా చాలా ఇబ్బంది పడుతుంటారని, అంతే కాకుండా సరైన పోషకాలు అందకుండా అర్ధాకలితో అలమటిస్తుంటారని, ఇటువంటి వారికీ ఇది ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీనివాస్ యాదవ్ తో పాటు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, సభ్యులు కళ్యాణి, పద్మావతి, విజయలక్ష్మి,ఏ. ఐ జీ. డాక్టర్స్ కళ్యాణ్, రోహిత్,తో పాటు కాలనీ వాసులు బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీను, సాంబయ్య, పితాని శ్రీనివాస్, గొర్రెపాటి వివేక్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…