జలమండలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్
అతి త్వరలో బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, బీరంగూడ పరిధిలో నూతన రిజర్వాయర్లు, ట్యాంకుల ప్రారంభం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫెజ్ 2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిలమండలి అధికారులతో ఎంఎల్ఏ జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల ప్రగతిని ఎంఎల్ఏ కు వివరించారు. ప్రధానంగా బొల్లారం బీరంగూడ అమీన్పూర్ తెల్లాపూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో పంపింగ్ పనులు సైతం పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య జలాలతో ఇబ్బంది పడుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. పైపులైన్ల లీకేజీ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, శివకుమార్, ఏఈలు ప్రవీణ్, పూర్ణేశ్వరి, శ్రీనివాస్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…