మియాపూర్ లో ఘనంగా బోనాల మహోత్సవాలు

politics Telangana

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ 

మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ :

ఆదివారం రోజు బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలు, తొట్టెల ఊరేగింపు మహోత్సవం, అలాగే చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమాల్లో మియాపూర్ కాంగ్రెస్ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.మియాపూర్ స్టాలిన్ నగర్‌లో నిర్వహించిన బోనాల మహోత్సవానికి టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్, పవన్ ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు మియాపూర్ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్థించారు. మియాపూర్ యువ నాయకులు, స్థానికులు యలమంచి ఉదయ్ కిరణ్ ను శాలువా లతో సత్కరించారు. చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమానికి కట్ల శేఖర్ రెడ్డి స్వామి, శ్రీకాంత్ ల ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమాల్లో శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, రత్నాచారి, నాగసాయి, సాయి నిఖిల్, రామ్, భువనేశ్వర్ తదితరులతో పాటు కాలనీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, టెంపుల్ కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *