బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
మున్సిపాలిటీ పరిధిలోని బొల్లారం పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు శాంతా క్లాజ్ వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు కౌన్సిలర్ వేణుపాల్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి , యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి’లు మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. జీసస్ క్రైస్ట్ బోధనలు లోకానికి అనుసరణీయమన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను పాఠశాల యజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోబాబు , మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు , పాఠశాల హెచ్ఎం ప్రభు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.