Hyderabad

ఆర్ కృష్ణయ్య దీక్షకు మద్దతు తెలిపిన బిసి సంఘం నాయకులు

శేరిలింగంపల్లి :

బిసి బంధు ప్రకటించాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వివిధ జిల్లాలకు చెందిన సంఘం సభ్యులతో తరలి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రoలో వెనుకబడిన బిసికులాల అభివృద్ధికి బిసి బంద్ ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య చేపట్టిన దీక్షకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవడానికి అన్ని కులాల వారు కల్సి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బీసీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య కు మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని పేర్కొన్నారు. ధర్మ పోరాట దీక్షకు తరలి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దతు తెలిసిన వారిలో సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ తదితరులున్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago