ఎంపీ అభ్యర్థి నీలం మధు గారిని
కలుస్తున్న కార్యకర్తలు,అభిమానులు.
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ, సబ్బండ వర్గాలకు చెందిన నీలం మధు గారికి రోజు రోజుకి అభిమానుల నుంచి అనూహ్యoగా మద్దతు లభిస్తోంది. ఆయనను కలిసేందుకు ఉదయం నుంచే అభిమానులు వస్తున్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన అభిమానులు అభ్యర్థి నీలం మధు గారిని ముదిరాజును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల భోకే, అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలలో తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికలలో తమ వెంట ఉండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నీలం మధు గారికి హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారిలో బీరంగూడ కు చెందిన ముస్లిం మైనారిటీ నేత సత్తార్ అనుచరులు, వెల్దుర్తి రవీందర్ గౌడ్, గొల్లపల్లి సదాశివ గౌడ్, చంద్రపూర్ లింగం, ఆందూర్ సాయిరాం, కమ్మపల్లి అబిరాజ్, కంచనపల్లి రాములు, మార్కుర్ సత్యనారాయణ, జగదేవ్పూర్ రాజు, చేగుంట బిక్షపతి, పటేల్ గూడా హనుమంత రెడ్డి, కొత్తూరు రవి, జిన్నారం మహేష్, దుబ్బాక తేజ, పటాన్చెరు దస్తగిరి తమ తమ అనుచరులతో నీలం మధు గారిని కలిసిన వారిలో ఉన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…