Districts

పొలంకు వెళ్ళే రస్తా ను కబ్జా చేసిన బైలుప్పల గ్రామ సర్పంచ్

_బ్రిటిష్ కాలం నాటి రస్తా కు ట్రాక్టర్లు అడ్డు పెట్టి దారి మల్లించిన సర్పంచ్

_జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :

గ్రామం లో అందరికి కావాల్సిన వాడని, ప్రజలకు మేలు చేస్తాడని, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూన్న గ్రామ సర్పంచ్  బ్రిటిష్ కాలం నాటి నుండి రైతులు నిత్యం పొలాలకు వెళ్లే దారినే అపహరించిన అధికార పార్టీ సర్పంచ్ నుండి రస్తా ను కాపాడండి అంటూ గొనెగండ్ల మండలం బైలుప్పల గ్రామ రైతులు జిల్లా ఉన్నత అధికారులను ఆశ్రయించారు.కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి గొనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామానికి చెందిన సుమారు 60 మంది రైతులు కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు.

గొనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామ సర్పంచ్ పెద్ద బజారి పొలం మీదుగా సుమారు 300 ఎకరాలకు, 64 మంది రైతు కుటుంబాలు తమ పొలాలకు వెళుతూ, వస్తూ ఉంటారు, బ్రిటీస్ కాలం నాటి రస్తా ను గ్రామ సర్పంచ్ అయిన పెద్ద బజారి దౌర్జన్యంగా అడ్డుకొని, రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు.నేను వదిలిన రస్తా లొ పోవాలి కాదు కూడదని పాత రస్తా లొ తిరిగితే మీ అంతు చూస్తానని బేరిరిస్తూ బ్రిటిష్ కాలం నాటి రస్తా లో తిరగ కుండా ట్రాక్టర్లు అడ్డు పెట్టినాడు. పెద్ద బజారి ఇలా రస్తా ను అడ్డుకోవడం వలన, బజారి పొలం పైన ఉన్న రైతులు, కింద ఉన్న రైతులు అందరు వారికి ఇష్టం వచ్చినట్లు రస్తాలు మార్చుకుంటూ పోయే ప్రమాదం లేకపోలేదు, కావున గ్రామం లో ఎలాంటి గొడవలు జరగ కుండా గతం లో ఉన్న రస్తా ను యాదవిదంగా ఉంచి రైతులకు న్యాయం చేయలని రైతులు కోరుతున్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago