రామచంద్రాపురం
రామచంద్రాపురం అశోక్ నగర్ లోని సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్.సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్ సి సి చేరాలంటే పదమూడేళ్ళ ఉండాలని ఎన్ సి సి తప్పకుండా పిల్లల త్తల్లిదండ్రుల పర్మిషన్ ఉండలని ఎన్ సి సి ఎంపికైనా విద్యార్థులకి ప్రతివారం ట్రైన్నిగ్ క్లాసులు , అలాగే పిల్లలకు ఒకక్రమశిక్షణ భాద్యతరహితంగా ఉండే విధంగా తీర్చిద్దితురని అని తెలిపారు .ఎన్ సి సి క్యాంపు కు ఎంపిక ఆయిన పి.ఆలేఖ్య తండ్రి రాజు మాట్లాడుతూ ఎన్ సిసి ద్వారా పిల్లలలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రమశిక్షణతో పాటు దేహదారుడ్యం ఉంటుందని అన్నారు. తన కూతురు ఎన్ సిసి క్యాంపు కు ఎంపిక కావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు.