Telangana

దొంగ ధర్నాలన్నీ కాంట్రాక్టర్ల కోసమే కదా?_బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేత గడిల శ్రీకాంత్‌గౌడ్  మీ మద్దతు రైతులకా? లేక మీ కాంట్రాక్టర్లకా అంటూ ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ యువరాజు ధర్నాకు పిలుపు ఇవ్వగానే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ సమస్యపైన ధర్నా చేయాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అసలు మీరు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం రైతులకు, రైతు కూలీలకు పంటలు పండించే అవకాశం లేనప్పుడు వారికి వచ్చే నిధులను దారి మళ్లించి.. వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మీరు ధర్నాలు రైతుల కోసం చేస్తున్నారా? కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారా? అని నిలదీశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు కాంట్రాక్టులు పేరుతో.. సీసీ రోడ్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. మీ క్రషర్ల వల్ల నియోజకవర్గంలోని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని.. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ పథకంలో వచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాలుష్యం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల వలన పరిష్కారం కోసం బాధితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, కోర్టు ద్వారా వారికి కొంత నగదును ఇవ్వాలని తీర్పు వచ్చిందన్నారు.

సంవత్సరాలు గడుస్తున్నా వారికి న్యాయం చేయలేని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కూడా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులకు రైతుల పక్షాన ధర్నాలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇంకోసారి ధర్నాలు చేస్తే భారతీయ జనతాపార్టీ తరపున అడ్డుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్‌రాజ్, ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు షకీల్,‌ దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago