మనవార్తలు ,పటాన్ చెరు:
దక్షిణాఫ్రికా , డర్బన్లోని క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో రెండు నెలల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లనున్నారు . మే 1 నుంచి జూన్ 30 వ తేదీ వరకు ఆయన డర్బన్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . నూతన ఫార్మాస్యూటికల్ యాక్టివ్ కాంపౌండ్లు , ఎల్డీఏ ఆమోదించిన సమ్మేళనాలను వివిధ ఫార్మాస్యూటికల్ డోసేజ్లలో నిర్ణయించడానికి ఒక అధునాతన లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిని అభివృద్ధి చేయడంతో పాటు ప్రయోగాల రూపకల్పన , యూనిక్ గ్రీన్ క్రోమాటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా డిజెన్ ద్వారా విశ్లేషణాత్మక నాణ్యతను అమలు చేయడం ఈ పర్యటన ఉద్దేశంగా ఆయన వివరించారు . పరిశోధనల కోసం ఇంతకు మునుపు దక్షిణాఫ్రికా , అమెరికా వెళ్ళొచ్చిన డాక్టర్ కటారి , ప్రస్తుతం మరోసారి డర్బన్ కు పయనం కావడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు , ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…