Hyderabad

ఇండియన్ పేటెంట్ జర్నల్ లో గీతం ప్రొఫెసర్ డిజైన్ ప్రచురణ

పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘా రూపొందించిన డిజైన్ పేటెంట్ ప్రముఖ ఇండియన్ పేటెంట్ జర్నల్ లో ప్రచురితమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పేటెంట్లు, డిజెన్లు, ట్రేడ్మార్క్ ల కంట్రోలర్ జనరల్ దీనిని ఆమోదించినట్టు శనివారం వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ ను గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.

విజయవంతంగా ముగిసిన జాతీయ సదస్సు

గీతం, హైదరాబాద్‌ లోని సీఎస్ఈ విభాగం అధ్వర్యంలో ‘కంప్యూటింగ్ – డేటా సైన్సెస్ లో ఇటీవలి ఆవిష్కరణలు’ అనే అంశంపై ఈనెల 12-13 తేదీలలో నిర్వహించిన ఆన్‌లైన్ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల నుంచి సదస్యులు కంప్యూటర్ సైన్స్ లో ఇటీవలి ఆవిష్కరణలపై పత్ర సమర్పణ చేయగా, అందులో ఎంపిక చేసిన వాటిని ప్రచురించినట్టు సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ వివరించారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ సి.చంద్రశేఖర్, ఎన్ఐటీ సూరత్ కల్ కు చెందిన ప్రొఫెసర్ అన్నప్ప తదితరులు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసినట్టు తెలియజేశారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago