సిఐటియు ఉంటేనే కార్మికులకు సమ న్యాయం
పోరాటాల, త్యాగాల చరిత్ర సిఐటియుది
యజమాన్యాలకు లొంగని సంఘం సిఐటియు
జేకే పెన్నార్ లో ఎగిరిన సిఐటియు జెండా
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
కార్మికుల సమస్యల కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య,పి పాండురంగారెడ్డి లు అన్నారు.పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని జెకె ఫెన్నార్ పరిశ్రమ వద్ద శనివారం సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య, పి పాండురంగారెడ్డి లు మాట్లాడుతూ కార్మికుల కోసం నిరంతరం పోరాడుతున్నది, త్యాగాలు చేస్తున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు మాత్రమేనని యజమాన్యాలకు లొంగని ఏకైక కార్మిక సంఘం సిఐటియు మాత్రమేనని చెప్పారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వము కార్మికులను అణిచివేసే విధంగా లేబర్ కోడ్ లను తెస్తుందని, లేబర్ కోడ్ ల గురించి తెలిసిన సంఘం కూడా సిఐటియు అని తెలిపారు. జెకె ఫెన్నార్ లో చాలా సంవత్సరాల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాబోయే ఎన్నికల్లో సిఐటియుని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. సిఐటియు ఉన్నచోట మాత్రమే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే మెరుగైన వేతన ఒప్పందలు చేస్తున్న చరిత్ర సిఐటియు సంఘానికే ఉందని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు, నిత్యము కార్మికల కోసం ఆలోచించే నాయకులు, త్యాగాలు చేసే నాయకులు, పోరాడే నాయకులు సిఐటియు వారేనని పేర్కొన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా వారు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ నాయకులు ప్రదీప్, కిర్బీ నాయకులు లఖాన్ ,అగర్వాల్ నాయకులు రామకృష్ణ, సువెన్ ఫార్మ నాయకులు వెంకటేష్, వ్యాగ్ వాల్స్ నాయకులు రాజు, జెకె ఫెన్నార్ నాయకులు సాంబయ్య, రాజ్ కుమార్లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జెకె ఫెన్నార్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బాబు, రాథోడ్, నాయక్, ధర్మారావు, హర్ష వివిధ పరిశ్రమల నాయకులు సదాశివరెడ్డి, శ్యామ్, సుధాకర్, విట్టల్, నారాయణ తదితర కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…