మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవతా సదస్సు, అవార్డులు 2026లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డి కొల్లి అందుకున్నారు.సుస్థిర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాజ పరివర్తనకు ఆమె చేసిన కృషికి గాను మేఘనకు ‘యంగ్ సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ప్రదానం చేశారు. ఆమె సంస్థ, ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ (ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్), ‘బెస్ట్ ఎన్జీవో ఆఫ్ ది ఇయర్ – సస్టైనబుల్ సోషల్ ఇంపాక్ట్’ (సుస్థిర సామాజిక ప్రభావంలో ఈ ఏడాది మేటి స్వచ్ఛంద సంస్థ) పురస్కారంతో కూడా సత్కరించారు.భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్.ఈ.సీ.ఎల్) నిర్వహించిన ఈ సదస్సు, మానవతా సేవ, దేశ నిర్మాణానికి గణనీయమైన కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించింది.గీతం నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలై, ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మేఘన, ఎం.ఆర్. ఫ్యూచర్ ఫౌండషన్ కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఆమె నాయకత్వంలో, ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్. ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ సుస్థిరత, సామాజిక న్యాయం, మానసిక ఆరోగ్యం, జీవనోపాధి ప్రోత్సహం, సామాజిక అభివృద్ధి రంగాలలో ప్రభావవంతమైన కార్యక్రమాలను చేపట్టింది.ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద క్షయవ్యాధి పోషకాహార సహాయ కార్యక్రమంతో పాటు, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, అక్షరాస్యత, బలహీన వర్గాలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు కూడా దీని ముఖ్య కార్యక్రమాలలో ఉన్నాయి.ఈ రెండు జాతీయ పురస్కారాలు మేఘన వ్యక్తిగత నాయకత్వాన్ని, అలాగే ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్. నిరంతర సామాజిక ప్రభావాన్ని గుర్తిస్తున్నాయి. మరింత సమ్మిళిత, సుస్థిర సమాజాన్ని నిర్మించడంలో యువత నేతృత్వంలోని కార్యక్రమాల పెరుగుతున్న పాత్రను ఇవి నొక్కి చెబుతున్నాయి.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…