పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాతరలు ప్రతీక అన్నారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, గూడెం పల్లవి విక్రమ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…