సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పటాన్‌చెరు, గుమ్మడిదల మండల పరిధిలోగల గ్రామాలలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్‌చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పిఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే. రాబోయే పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతినెల గ్రామపంచాయతీకి ఆదాయం లభిస్తుందని తెలిపారు.భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు.గుమ్మడిదల మండల పరిధిలోని అనంతరం, కానుకుంట, నూతనకల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి హ్యమ్ ద్వారా నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు డిఈ దీపక్ తెలిపారు. టెండర్లు పూర్తి చేసిన పనులు ప్రారంభించక పోతే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవోలు యాదగిరి, ఉమాదేవి, పిఆర్ డిఈ దీపక్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఏఈ శశిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…