గీతంలో ఎపోచ్ 4.0 పేరిట మూడు రోజుల సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎపోచ్ 4.0 పేరిట ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించిన సాంకేతికోత్సవాలు విద్యార్థుల మెదడుకు పదును పెట్టాయి. గీతం స్టూడెంట్స్ క్లబ్ సహకారంతో గిట్ హబ్ కమ్యూనిటీ నిర్వహించిన ఈ పోటీలు- ఆచరణాత్మక అభ్యాసం, పరస్పర సహకారం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పట్టును పెంపొందించే లక్ష్యంతో సాగాయి.టెక్ ట్రివియాతో ఆరంభమైన ఈ కార్యక్రమం, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, హార్డ్ వేర్, సైబర్ భద్రత, టెక్ చరిత్ర, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పాల్గొన్న వారి జ్జానాన్ని పరీక్షించేలా పోటీలు సాగాయి. దీని తరువాత డాకర్ 101 అనే ఆచరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది విద్యార్థులను కంటైనరైజేషన్ కు పరిచయం చేసింది. ఇందులో కోర్ డాకర్ భావనలు, ఇన్ స్టాలేషన్, ముఖ్యమైన ఆదేశాలు, ఇమేజ్ బిల్డింగ్, కంటైనర్ నిర్వహణ వంటివి ఉన్నాయి.
రెండవ రోజు, ఓపెన్-సోర్స్ డెవలప్ మెంట్ పై జరిగిన కార్యక్రమం ద్వారా సహకార అభివృద్ధి పద్ధతులపై దృష్టి సారించారు. ఇక్కడ విద్యార్థులకు గిట్ హబ్ వంటి ప్లాట్ ఫామ్ లపై ఓపెన్-సోర్స్, సహకార వర్క్ ఫ్లోలను పరిచయం చేశారు. కాల పరిమితితో వినూత్న సాధనాలను రూపొందించడానికి, నిర్మించడానికి బృందాలను ప్రోత్సహించే ఉత్పాదకత సాధన కోడింగ్ ఛాలెంజ్ తో రెండో రోజు ముగిసింది.ఇక చివరి రోజున, ఆధునిక వెబ్ అప్లికేషన్ల కోసం పూర్తి ప్రాంప్ట్-టు-ప్రొడక్షన్ వర్క్ ఫ్లోను ప్రదర్శించే కార్యశాల ప్రాంప్ట్-టు-పేజ్, ఆ తరువాత ట్రెజర్ హంట్, సమస్య-పరిష్కారాన్ని నిర్వహించారు. చివరగా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)పై ఒక విజ్జానదాయక కార్యక్రమంతో ఎపోచ్ ముగిసింది. ఇందులో వాటి పరిమాణం, వినియోగం, ఓపెన్-సోర్స్ ఏఐ పర్యావరణ వ్యవస్థలోని పోకడలపై దృష్టి సారించారు.
ఉత్సాహభరితమైన వాతావరణానికి తోడు, ఈ కార్యక్రమం ఆసాంతం టెక్ ఆధారిత ఆటలు, సవాళ్లతో కూడిన ముఖాముఖి నేర్చుకునేలా స్టాళ్లను గిట్ హబ్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇది ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఆకర్షించడంతో, ఈ మూడు రోజులలో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద, ఎపోచ్ 4.0 విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు, విశ్వాసాన్ని పెంపొందించడానికి, అభ్యాసం, పోటీ, సహకారం ద్వారా వాస్తవ-ప్రపంచ సాఫ్ట్ వేర్ అభివృద్ధిపై ఆచరణాత్మక అవగాహనను ఏర్పరచుకోవడానికి ఒక చక్కని వేదికను అందించింది.
-పటాన్ చెరులో బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన -హరీష్ రావు నాయకత్వంపై నమ్మకంతో కీలక నేతల భారీ చేరిక -నియోజకవర్గ రాజకీయాల్లో…
గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ ఎన్ పి అర్ డి క్యాలెండర్ ఆవిష్కరణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: డ్రోన్ బూట్ క్యాంపు నాలుగో రోజు, గీతం విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీపై స్వీయ అవగాహనను…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…
ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…