పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘హోమ్ కమింగ్’ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు.ఆయా విభాగాల వారీగా విద్యార్థుల సమ్మేళనంతో ఆరంభమైన ఈ కార్యక్రమం, ముఖాముఖి చర్చలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, విశ్వవిద్యాలయంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడంతో పాటు పసందైన విందును ఆస్వాదించే వరకు కొనసాగింది.ఆ తరువాత విశ్వవిద్యాలయ స్థాయిలో శివాజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు. ఎన్నో పనులలో నిమగ్నమైన వారు తమ నిలువైన సమయాన్ని తన తోటి సహచరులతో పాటు ప్రస్తుత విద్యార్థులతో గడపడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి స్వాగత ప్రసంగంలో హర్షం వెలిబుచ్చారు.ఎంతో శ్రమకోర్చి వచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కృ తజ్ఞతలు తెలియజేశారు. వారంతా విశ్వవిద్యాలయంతో మరింత మమేకం కావాల్సిన అశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. వివిధ కార్యక్రమాల ద్వారా తను మద్దతును కొనసాగిస్తున్న పూర్వ విద్యార్థులకు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ధన్యవాదాలు తెలిపారు.
కార్నివాల్, స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్పో వంటి ఆహ్లాదకరమైన సాంకేతిక కార్యకలపాలలో విద్యార్థులు పాల్గొని, తమ అధ్యాపకులతో పలు అంశాలను ముచ్చటించారు. పూర్వ విద్యార్థులను మధుర క్షణాలను మరింత ఆనందమనం చేసే లక్ష్యంతో ఏర్పాటుచేసిన క్రీడా పోటీలు బృంద స్ఫూర్తిని చాటటడమేగాక వారిలోని నెపుణ్యాలను ప్రదర్శించే వీలు కల్పించాయి. ఇక చివరిగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే గాక మరపురాని అనుభూతులను మిగిల్చాయి.’హోమ్ కమింగ్-2023)ను నిర్వహించినందుకు, తమ పూర్వ విద్యార్థులతో మళ్లీ అనుసంధానం కావడం, ఈ ప్రాంగణంలో వారు గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం చూసి తాము మథురానుభూతికి లోనయినట్టు పూర్వ విద్యార్థుల వ్యవహారాల డిప్యూటీ డెరైక్టర్ నవీన్ సినపాత్రుని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులు తిరిగి తాము చదివిన విద్యా సంస్థను సందర్శించడానికి, ప్రస్తుత విద్యార్థులతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పించిందన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…