_శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల నివాళులు
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా, బచ్చన్న పేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య చిన్న కుమారుడు బొడికే శ్రీనివాస్ (45) శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ ప్రస్థానం అనే దినపత్రికలో గత ఆరు ఏడు సంవత్సరాలుగా విలేకరిగా పనిచేస్తున్నాడు. బొడికే శ్రీనివాస్ అనే పాత్రికేయుడు గత రెండు రోజుల క్రితం పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం గ్రామంలో ఓ బార్ట్4 డే పార్టీకి శ్రీనివాస్ భార్య ఇందిరా, ఆయన కుమారుడు నందకుమార్ (8) మరియు ఆయన స్నేహితుడు రమేష్ (34) వాళ్ళ భార్య సంధ్య (28) అతని ముగ్గురు పిల్లలు కలిసి మధ్యాహ్నం వెళ్లి తిరిగి వచ్చి క్రమంలో సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్, రమేష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చుట్టుపక్కల వారు 108 వాహనం లో పటాన్ చెర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి కి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని మృతులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ క్లబ్ తరఫున ఆయన కుటుంబానికి తాము అండగా నిలబడతామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. తోటి పాత్రికేయూన్ని ఇలా ప్రమాదవశాత్తు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఇంతకు ముందు కూడా అనేకమంది పాతికేయ సోదరులు తమ వృత్తిలో భాగంగా వివిధ కారణాలతో చనిపోవడం జరిగిందని, వారందరికీ కూడా తమ సానుభూతిని తెలుపుతున్నట్టు సభ్యులు తెలిపారు. ఈయన కుటుంబాన్నీ ఆదుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ గ్రామమైన నాగిరెడ్డిపల్లి లో అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…