పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
అంగన్వాడీ ఉద్యోగలు చట్టపరంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బానూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని,తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించినా వినక పోవడం వల్లనే సమ్మెకు వెళ్ళడం జరిగిందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మంచిది కాదన్నారు. ఇవ్వేవి చేయకుండా ఇతర డిపార్ట్ మెంటుకు సంబందించిన వారిని బెదిరించి నాగులపల్లి, సందు గూడెం, వెలిమెల అంగన్వాడీ సెంటర్లు తెరవాలని బలవంతంగా తాళాలు పగల గొట్టడం ఎంతవరకు సమంజస మ న్నారు.అంగన్వాడీ సెంటర్స్ లో వంట గ్యాస్ సిలిండర్లు, వంట సమాను,ఫ్రిస్కూల్ కిట్స్,బియ్యం,పప్పు,బాలామృతం, పాలు,నూనెలు,గుడ్లు, పిల్లలకు సంబందించిన ఆట వస్తువులు,రికార్డులు, డబ్బులు ఇలా అనేకం ఉన్నాయన్నారు. సెంటర్ల తాళాలు ఎవరైతే పగలగొట్టారో వారే భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పగలగొట్టిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో విజయలక్ష్మి హెల్పర్లు పాల్గోన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…