Telangana

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు;

పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోరాటంలో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ కిషన్ రావు ను నందిగామలోని తన నివాసంలో కలిసి సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరువులో ఆసుపత్రి రావడానికి ముఖ్య కారణం 20 గ్రామాల ప్రజలు, వాళ్ళు కాలుష్యానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, పారిశ్రామలకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట ఫలితమే ఈ యొక్క 200 పడకల ఆసుపత్రి అని తెలిపారు.

ఆ నిధులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే బాధితుల కోసం ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి దాని నిర్వహణ చేయాలి దాంట్లో కచ్చితంగా డీటాక్సిఫికేషన్ సెంటర్ అంటే పొల్యూషన్ వల్ల ఏర్పడ్డటువంటి టాక్సిన్స్ తోటి ఏవైతే జనాలు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నారు, పొల్యూషన్ కారణంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి రోగాలను, జబ్బులను చికిత్స చేయడానికి తీర్పు ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆసుపత్రి అని తెలియజేశారు.జడ్జిమెంట్ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ 20 గ్రామాల ప్రజల పోరాటం వల్ల అదేవిధంగా కంటెంట్ ఆఫ్ కోర్టు ఎక్కడ ఫైల్ చేస్తారు అన్న భయంతోటి ప్రభుత్వం ఈ యొక్క జీవో ఆగమేఘాల మీద మంజురు చేసి శంకుస్థాపన  చేశారని అన్నారు .

ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ శంకుస్థాపనకు వచ్చినటువంటి మంత్రులు గాని మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేస్తుంది అని ఏవైతే గొప్పలు చెప్పుకుంటున్నారు అదంతా అబద్ధమని ఇది రావడానికి కారణం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెట్టినా వాళ్ళని శ్రీకాంత్ గౌడ్ గుర్తు చేశారు.అదేవిధంగా ఈ కడుతున్నటువంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆసుపత్రికి ఆ ప్రాంతం సరిపోదు ,పటాన్ చెరువు పరిసర ప్రాంతాలలో 25 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో భాగస్వాములు అయినటువంటి  డాక్టర్ కిషన్ రావు ని ఆరుట్ల వెంకట్ రెడ్డి గారు, లగ్డారం గ్రామ నర్సింహరెడ్డి గారు, చిదురుప్పా గ్రామానికి చెందినటువంటి ముత్యాలు గారు ఇంకా అనేకమంది రైతులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉందని, వారి పోరాట ఫలితమే ఈ యొక్క ఆసుపత్రి, నష్టపరిహారం ఇంకా తీర్పులో ఉన్నటువంటి వాటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవియ్యకుండా తాత్సారం చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుందో దీనిపైన న్యాయపరంగా అదే రకంగా కచ్చితంగా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఆ తీర్పులో ఉన్నటువంటి అన్ని ఫలాలు అర్హులైన వారికి చేరే వరకు క్రృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవెందర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago