శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన

Hyderabad politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

శ్రావణ మాసం సందర్బంగా శుక్రవారం రోజు చందానగర్, గౌతమి నగర్ వేముకుంట లో గల శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం లో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 300 మహిళలు అమ్మవారి లలితా సహస్రనామ.కుంకుమార్చనలో పాల్గొన్నారు, మరియు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా సోదరీమణులు పూజకు వచ్చిన వారికి సోదర భావంతో అందరికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం సుమారు 1000 మంది భక్తులు అన్నప్రాసాదం స్వీకరించినారు. ఈ పూజలో పీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్ మంజుల రగునాథరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘనందనరెడ్డి, నాయకులు భక్తులు పాల్గొన్నారు. జిల్లా సెక్రటరీ కట్ల శేఖర్ రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరియు భక్తులందరికి దేవాలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *