స్టాలిన్ నగర్ ఎల్లమ్మ , పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ :

బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, టిపిసిసి జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ మియాపూర్ స్టాలిన్ నగర్‌లో నిర్వహించిన బోనాల మహోత్సవానికి టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్, పవన్ ఆహ్వానం మేరకు హాజరై నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్ధించారు. జగదీశ్వర్ గౌడ్ ను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో నల్ల సంజీవరెడ్డి, వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, దోర్నాల రవి కుమార్, యాకన్న , తాండ్ర రామచందర్ గౌడ్, సాయి గౌడ్, దస్తప్ప, రమేష్, ప్రసాద్, రామయ్య, కవిత , ఆంజనేయులు గౌడ్, ప్రదీప్, ప్రసాద్, మోహన్, రాజు, మాధవ, హన్మంతరావు, కృష్ణ గౌడ్ , చాకలి రాజు, మధు, చంద్ర మోహన్ రెడ్డి, లింగప్ప , లచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *