మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బిక్షపతి, శంకర్, వెంకటేష్, బల్వంత్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
