గీతంలో బిగ్ డేటా అనలిటిక్స్ పై కార్యశాల

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఎంటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల ‘బిగ్ డేటా అనలిటిక్స్: ఆచరణాత్మక శిక్షణ’ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యశాలను ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ నిర్వహిస్తుండగా, నాగపూర్ ప్రభుత్వ కళాశాలలోని సీఎస్ఈ విభాగం ఆచార్యుడు డాక్టర్ కమలాకాంత్ లక్షణ్ బవాంకులే ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు.హడూప్ ఉపయోగించి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ పై విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించడం దీని లక్ష్యమన్నారు. ఈ శిక్షణలో భాగంగా, ప్రాథమిక భావనలు, సిస్టమ్ రూపకల్పన, ఆచణాత్మక వ్యాయామాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు బిగ్ డేటా ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్ పై సమగ్ర అవగాహన పొందుతారని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *