పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది ‘ఏక్ తారీఖ్ ఏక్ మంటా ఏక్ సార్ ‘ ఇతివృత్తంలో అక్టోబర్ 1న ఉదయం 10-11 గంటల వరకు పరిశుభ్రత కోసం గంట పాటు శ్రమదానం చేయాలని ఇచ్చిన పిలుపులో గీతం విద్యార్థులు కూడా పాల్గొన్నారు. తమ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు, వారి కమ్యూనిటీలలో పరిశుభ్రతను ప్రోత్సహించడంలో చురుకుగాపాల్గొనేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
గాంధీజీకి నివాళులర్పించే కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ సర్మ, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్సర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, స్కూల్ ఆఫ్ సెర్చ్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ. రామరావు, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశానికి, ప్రపంచానికి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు.మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడంతో పాటు నేటి ప్రపంచంలో ఆయన బోధనలు, సూత్రాల ప్రాముఖ్యతను గీతం ఉన్నతాధికారులు గుర్తుచేశారు. విశ్వవిద్యాలయం తన విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించడానికి, సామాజిక బాధ్యత, సత్యం, అహింసను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…