Telangana

మ్యాక్స్ ఫ్యాషన్ బొమ్మల కొలువును ప్రారంభించిన :.సిని నటి నమ్రతా శిరోద్కర్

మనవార్తలు ,హైదరాబాద్:

దక్షిణాదిలో మిలియన్ల మంది టీన్ హార్ట్‌త్రోబ్ పాన్స్ ఉన్న పాపులర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని అతిపెద్ద మానీక్విన్స్ బొమ్మల కొలువు ప్రారంభించారు.దుబాయ్ కేంద్రంగా కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు మా మాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ 82 చేరనుంది. దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానుండగా, వినియోగదారులను ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ ధర కె లక్ష్యంగా నెల రోజుల పాటు మ్యాక్స్ ఈ వేడుకను లకు సిద్ధమైంది. హార్ట్ ఆఫ్ హైదరాబాద్‌ ఉన్న కెపిహెచ్ బి నెక్సస్ మాల్‌లో 30 x 40 అడుగుల భారీ బొమ్మల కొలువును ప్రారంభించింది. దీనితో పాటుగా మ్యాక్స్ ఈ పండుగ సీజన్‌లో బహుమతులు కొన్ని వృద్ధాశ్రమాలు మరియు అనాథ శరణాలయాలను భాగస్వామ్యం చేసింది.పాపులర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. సంయుక్తంగా వారు 150కి పైగా మానీక్విన్స్ ( బొమ్మలు) తో కూడిన బొమ్మల కొలువును ఆవిష్కరించారు, ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను వివరిస్తుంది మరియు మ్యాక్స్ యొక్క తాజా పండుగ కలెక్షన్ తో ఇవి అలంకరించబడ్డాయి. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ ఎన్జీవోల నుండి పిల్లలు మరియు వృద్ధుల కు దసరా కానుకలను  అందజేశారు.

ఈ సందర్భంగా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మ్యాక్స్ ఫ్యాషన్‌- ఇండియా వైస్ ప్రెసిడెంట్ & మార్కెటింగ్ హెడ్ పల్లవి పాండే మాట్లాడుతూ, “అతిపెద్ద బొమ్మల కొలువు మరియు దసరా పెస్టివల్ ఆఫర్స్ ను ప్రారంభించడం ద్వారా, మా కస్టమర్‌లకు షాపింగ్‌కు మంచి సంతోషాన్ని అందించడమే మా ప్రయత్నం. రోజువారీ ఫ్యాషన్ కోసం సాంప్రదాయ మరియు లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు అందించిడమే మా లక్ష్యం” అని అన్నారు.

నగరంలో ఈ వేడుకను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. హైదరాబాద్ మాకు చాలా ప్రత్యేకం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మా అమ్మకాలలో 64% ఈ నగరం నుండి వస్తున్నాయి. మేము మరింత మంది కస్టమర్లకు సేవలందించేందుకు మరియు వారి పండుగ వేడుకల్లో అంతర్భాగంగా మారేందుకు ఎదురుచూస్తున్నాము” అని మ్యాక్స్ ఫ్యాషన్ రీజినల్ బిజినెస్ హెడ్ పెద్దిరాజు ఆనంద్ రామ్ తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago