మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల గ్రామానికి చెందిన సుమారు 100 మంది యువత ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గచ్చిబౌలి డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సమక్షంలో, సీనియర్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా యువతకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ ప్రోత్సాహంతో యువత పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. నల్లగండ్ల అభివృద్ధికి కృషి చేస్తామని పార్టీలో చేరిన యువత పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
