Telangana

యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీలు

 _న‌గ‌రంలోని ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి ఘ‌న‌త‌

మనవార్తలు ,హైదరాబాద్: 

యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) మ‌రో ఘ‌న‌త సాధించింది. యూరాల‌జీ, యూరో-ఆంకాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. రోగుల‌కు మెరుగైన ఫ‌లితాలు అందించేందుకు అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌డం ద్వారా ఏఐఎన్‌యూ ఈ అసాధార‌ణ ఘ‌న‌త సాధించింది.ఏఐఎన్ యూలోని రోబోటిక్ సర్జరీ ప్రోగ్రాం అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్ల నైపుణ్యం, అత్యాధునిక రోబోటిక్ అసిస్టెడ్ సర్జికల్ సిస్టమ్స్ స‌మ్మిళితంగా ఉంటుంది. ఈ విధానం వ‌ల్ల శస్త్రచికిత్సల సమయంలో మరింత క‌చ్చితత్వం, నైపుణ్యం, విజువ‌లైజేష‌న్ వ‌స్తాయి. చివరికి మెరుగైన క్లినికల్ ఫలితాలు, రోగులకు శస్త్రచికిత్స త‌ర్వాత ఇబ్బందులు తగ్గడం, తక్కువ రక్త నష్టం, వేగంగా కోలుకోవడానికి వీలు క‌ల్పిస్తాయి.కిడ్నీ కేన్స‌ర్, ప్రోస్టేట్ కేన్స‌ర్, బ్లాడ‌ర్ కేన్స‌ర్, రీక‌న్‌స్ట్ర‌క్టివ్ యూరాల‌జీ (మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణం, మ‌ర‌మ్మ‌తుల‌కు) లాంటి చికిత్స‌ల‌లో ఈ రోబోటిక్ స‌ర్జ‌రీలు చేశారు.రోబోటిక్ స‌ర్జ‌రీల వ‌ల్ల రోగుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్, చీఫ్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సి. మ‌ల్లికార్జున మాట్లాడుతూ, “ఆప‌రేష‌న్ త‌ర్వాత రోగి కోలుకునే తీరులో సంప్ర‌దాయ శ‌స్త్రచికిత్స‌, రోబోటిక్ శ‌స్త్రచికిత్స‌ల మ‌ధ్య తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పూర్తి ప్రోస్టేటెక్ట‌మీ చేసిన త‌ర్వాత చాలామంది రోగుల‌కు మూత్ర‌విస‌ర్జ‌న‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఉంటాయి. వారికి మూత్ర విసర్జనలో నియంత్రణ ఉండదు. రోబోటిక్ శ‌స్త్రచికిత్స‌లో ఈ స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్కారం అవుతుంది. మూత్ర‌విస‌ర్జ‌న కూడా స‌ర్వ‌సాధార‌ణంగానే జ‌రుగుతుంది. సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌లో కొన్ని సున్నిత‌మైన న‌రాలు దెబ్బ‌తిన‌డంతో భ‌విష్య‌త్తులో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య వ‌స్తుంది. రోబోటిక్ శ‌స్త్రచికిత్స‌లో న‌రాలను జాగ్ర‌త్త‌గా కాపాడ‌టంతో వారికి ఈ స‌మ‌స్య ఉండ‌దు. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు క‌ణితిని మాత్ర‌మే తొల‌గించి, కిడ్నీని కాపాడేందుకు రోబోటిక్ సర్జరీలో అవకాశం ఉంటుంది. అదే సంప్ర‌దాయ చికిత్స‌ల‌లో అయితే, పూర్తి కిడ్నీని తొలగించాల్సి వ‌చ్చేది” అని చెప్పారు.రోబోటిక్ శ‌స్త్రచికిత్స‌ల విష‌యంలో మ‌రింత ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ‌, స‌హాకారాలు సాధించ‌డం ద్వారా ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి ఈ రంగంలో ముందంజ‌లో ఉండి, రోగుల‌కు అత్యంత అధునాత‌న సేవ‌లు అందిస్తోంది.

ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ గురించి:

ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ భార‌త‌దేశంలోనే యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నెట్‌వ‌ర్క్. ఇటీవ‌ల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవ‌ర్ చేసింది. నాలుగు న‌గ‌రాల్లో దీనికి ఏడు ఆస్ప‌త్రులు ఉన్నాయి. వాటిలో అగ్ర‌గ‌ణ్యులైన నెఫ్రాల‌జిస్టులు, యూరాల‌జిస్టులు ఉన్నారు. యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వైద్య‌ప‌ర‌మైన నైపుణ్యాల‌కు పేరెన్నిక‌గ‌న్న ఈ ఆస్ప‌త్రిలో.. యూరో-ఆంకాల‌జీ, రీక‌న్‌స్ట్ర‌క్టిక్ స‌ర్జ‌రీ, పీడియాట్రిక్ యూరాల‌జీ, ఫిమేల్ యూరాల‌జీ, ఆండ్రాల‌జీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ లాంటి శ‌స్త్రచికిత్స‌ల‌తో పాటు డ‌యాల‌సిస్ సేవ‌లూ అందుబాటులో ఉన్నాయి. భార‌త‌దేశంలో రోబోటిక్ స‌ర్జ‌రీల్లో ఇది మార్గ‌ద‌ర్శిగా ఉంది. ఈ ఆస్ప‌త్రుల నెట్‌వ‌ర్క్‌లో మొత్తం 500 ప‌డ‌క‌లు ఉన్నాయి, ల‌క్ష మందికి పైగా రోగుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు చికిత్స‌లు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్‌, డీఎన్‌బీ (యూరాజీ అండ్ నెఫ్రాల‌జీ), ఎఫ్ఎన్‌బీ (మినిమ‌ల్ ఇన్వేజివ్ యూరాల‌జీ) గుర్తింపు ఉంది. మ‌రింత స‌మాచారం కోసం సంద‌ర్శించండి.. https://ainuindia.org/

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago