TAX

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

Hyderabad

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

హైదరాబాద్:

ఇంకా ఐటీ రిటర్న్స్ చెయ్యలేదా…? మరేం పరవాలేదు. ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచడం జరిగింది. దీనితో మీరు ఆలస్యం అయినా చింతించకర్లేదు. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కష్టాలు పడాల్సి వస్తోంది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు, కర్సల్టెంట్లు తదితర వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణ లోకి తీసుకుని కేంద్రం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

దీనితో అధికారిక ప్రకటనని కూడా విడుదల చేసారు. ఆదాయపు పన్ను చట్టం లోని 139 సెక్షనలోని సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్లను, సబ్ సెక్షన్(4) కింద ఆలస్యమైన రిటర్న్లను కూడా 2021 మార్చి 31 నాటికి సమర్పించాల్సి ఉండేదని కానీ వైరస్ తీవ్రత ఎక్కువ ఉండడం తో ఆ తేదీని మే 31 నాటికి పొడించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBTD) తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *