ఈఎస్ఐ డిస్పెన్సరీ పటాన్ చెరులో లేకపోవడం తో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు
ఈఎస్ఐ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డా. గౌతమ్ కు సీఐటీయూ ప్రతినిధి బృందం వినతి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
రాష్ట్రంలోని ఈఎస్ఐ బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రస్తుతం రామచంద్రాపురంలో కొనసాగుతున్న పటాన్ చెరు ఈఎస్ఐ డిస్పెన్సరీని వెంటనే పటాన్ చెరు తరలించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈఎస్ఐ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డా. గౌతమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 50 వేల మంది ఈఎస్ఐ బీమాదారులు ఉన్నప్పటికీ, వారికి అందుబాటులో ఉండాల్సిన డిస్పెన్సరీ రామచంద్రాపురంలో కొనసాగడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.రోజువారీగా చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో కార్మికులు సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పటాన్ చెరులోనే ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులు, అన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షం లో కార్మికులను సమీకరించి పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వం ను హెచ్చరించ చారు ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు గంగాధర్, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…