ఖమ్మం
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ ని నియమించారు.ఈ సందర్బంగా నరాల సత్యనారయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నియమించి , పార్టీ జెండలు ఎగుర వేస్తాము అని అలాగే గడపగడపకు వైయస్సార్ టీపి పార్టీని తీసుకుపోతామని తెలిపారు.