Telangana

శ్రీ దేవి శరన్నవరాత్రి–దసరా ఉత్సవాల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

మియాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :

ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు . శ్రీ దేవి శరన్నవరాత్రి–దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మియాపూర్ హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీతో పాటు చందానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.మియాపూర్–మక్తా మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు కమిటీ సభ్యులు రాకేష్, నవీన్ గార్ల ఆహ్వానం మేరకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్మాత శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వం, సోదరభావం, దాతృత్వం, పరస్పర సహకారానికి ప్రతీకలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని జగన్మాత శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని యలమంచి ఉదయ్ కిరణ్ గారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు యలమంచి ఉదయ్ కిరణ్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమాల్లో వీరేంద్ర గౌడ్, రవీందర్ రెడ్డి, రాంచందర్ గౌడ్, రవికుమార్, మధు, నర్సింగ్, శరత్, కామినేని వాసు, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, సతీష్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago