Telangana

ఆపదలో ఉన్న కార్మిక కుటుంబానికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

మానవత్వంతో స్పందించి అంత్యక్రియల కోసం రూ.75 వేల ఆర్థిక సాయం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పొట్టకూటి కోసం సొంత రాష్ట్రాన్ని, ఆత్మీయులను విడిచి వచ్చి పటాన్చెరులో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాదంలో ఒకవైపు కన్నీరుమున్నీరవుతుండగా మరోవైపు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేక ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ విషాద సమయంలో విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అంత్యక్రియల నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ.75 వేల ఆర్థిక సాయం అందించి మానవీయతను చాటుకున్నారు.వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాకు చెందిన అమల్ ప్రమాణ్ గత కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి పటాన్చెరు ప్రాంతంలోని స్థానిక పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన.. శుక్రవారం రాత్రి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్వరాష్ట్రానికి తరలించడం, అంత్యక్రియలు నిర్వహించడం మరింత భారంగా మారింది. కనీసం చివరిసారిగా తమ ఆత్మీయుడికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలన్న కుటుంబ సభ్యుల ఆకాంక్షకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలిచాయి.ఈ పరిస్థితిని ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి  తన సొంత నిధుల నుంచి రూ.75 వేల ఆర్థిక సాయం అందించారు.

కష్టకాలంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమం, భద్రత, ఆపద సమయంలో సహాయం అందించడం పట్ల తాము బాధ్యతతో వ్యవహరిస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago