Telangana

పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ మానసపుత్రిక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

160 మంది లబ్ధిదారులకు రూ.1.60 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పేదింటి ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు చెందిన 160 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన రూ.1,60,18,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాల కోసం పేద కుటుంబాలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాల్లో వివాహ వేడుకలు సంతోషంగా జరిగేందుకు ఈ పథకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల తహశీల్దార్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

12 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago