Telangana

గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్ 2026

రూ. 20 లక్షల వరకు నగదు పురస్కారాలు

తొలి బహుమతిగా రూ.9 లక్షలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంటర్మీడియెట్ లేదా +2, డిగ్రీ విద్యార్థుల కోసం ఒక జాతీయ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆవిష్కరణల ఛాలెంజ్ ను ప్రకటించింది.నిజ జీవిత సమస్యలకు వినూత్నమైన, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 11, 12 తరగతులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్ పోటీ ఆహ్వానిస్తోంది. ‘కృత్రిమ మేధస్సుతో నిర్మించండి, జాతీయ స్థాయిలో పోటీపడండి’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ పోటీలో మొత్తం 20 లక్షల రూపాయల నగదు పురస్కారాలను అందజేస్తోంది.లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs), ఏఐ ఏపీఐలు, కస్టమ్ మోడల్స్, ఆటోమేషన్ టూల్స్, ఓపెన్-సోర్స్ ప్లాట్ ఫారాలు, ఏఐ ఏజెంట్లతో సహా కృత్రిమ మేదస్సు సాంకేతికతలను ఉపయోగించి, అర్థవంతమైన సవాళ్లను గుర్తించి, ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేసేలా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడమే ఈ పోటీ లక్ష్యం.

పోటీలో పాల్గొనేవారు వ్యక్తిగతంగా, లేదా గరిష్టంగా నలుగురు సభ్యుల బృందాలుగా నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీ అన్ స్టాప్ ద్వారా ఆన్ లైన్ సమర్పణతో ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేవారు తమ ఆలోచనను, నమూనాని (ప్రోటోటైప్) ఐదు స్లైడ్ల పిచ్ డెక్ లో ప్రదర్శించాలి. ఈ పిచ్ డెక్ లో సమస్య వివరణ, దాని ప్రాముఖ్యత, ఏఐ అనుసంధానం, పనిచేసే డెమో లేదా భావన యొక్క నిరూపణ (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) వంటి అంశాలు ఉండాలి.ఈ పోటీ అనేక దశల ద్వారా కొనసాగుతుంది. ఇందులో భాగంగా టాప్ 200 జట్లతో ఆన్ లైన్ క్వార్టర్-ఫైనల్స్, గీతం ప్రాంగణంలో టాప్ 100 జట్లతో ఆఫ్ లైన్ సెమీ-ఫైనల్స్, టాప్ 20 జట్లతో గ్రాండ్ ఫైనల్ ఉంటాయి. పాల్గొనేవారికి నిపుణులైన జ్యూరీ ప్యానెళ్ల ముందు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే, అలాగే స్ట్రాటజీ వర్క్ షాపులు, పోటీ పిచింగ్ సెషన్లలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి.

విజేత జట్టుకు 9 లక్షల రూపాయలు, రెండవ బహుమతికి 6 లక్షల రూపాయలు, మూడవ బహుమతికి 3 లక్షల రూపాయల నగదు పురస్కారాలు లభిస్తాయి. రెండు రన్నరప్ జట్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున లభిస్తాయి. పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్ 2026, యువతలో సృజనాత్మకత, సాంకేతిక ఆవిష్కరణ, వ్యవస్థాపక ఆలోచనా విధానాన్ని పెంపొందించి, వాస్తవ ప్రపంచంలోని తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడానికి, అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకునేలా వారికి సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

12 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago