Telangana

హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన *హీరోయిన్ శ్రీలీల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల చేతుల మీదుగా హియ్య వారి ఐదవ బ్రాంచ్ గా హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే అద్భుతమైన వాతావరణంతో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. నింగిని తలపించే రెస్టారెంట్ చూడగానే ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఆహ్వానించిన గౌతమి చౌదరి, గౌతమ్, విక్రంత్ లకు ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ అంటేనే అనేక రకాల రుచులకు అడ్రస్ అని చెప్పారు. అలాంటిది హియాస్పేస్ మండితో మరొక కొత్త రుచి హైదరాబాద్ ఫుడ్ లిస్టులో ఆడ్ అయింది అన్నారు.

గౌతమి చౌదరి తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ గా మొదలైన వీరి జర్నీ ఎలా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుందో తెలిసింది అన్నారు. ఇలా బ్రాంచెస్ పెంచుకుంటూ పోతూ ఆహార ప్రియులకు మంచి రుచులను అందించాలని కోరారు. రెస్టారెంట్ వాతావరణం చాలా ఆకట్టుకుందని, ఫ్యామిలీతో ఇక్కడికి వస్తే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అనే అంతలా చాలా ఆహ్లాదకరంగా ఉంది అని పేర్కొన్నారు. హియ్య స్పేస్ మండిలో ప్రత్యేకత వెజ్ మండి అని చెప్పారు. ఇక్కడ గుత్తొంకాయ మండి చాలా ఫేమస్ అని కచ్చితంగా ట్రై చేయాల్సిందే అంటూ తెలిపారు. గౌ

తమి చౌదరి మాట్లాడుతూ హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా తమ ఐదవ బ్రాంచ్ హియ్య స్పేస్ మండి లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మల్టిపుల్ థీమ్స్ తో వస్తున్న మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఫారెస్ట్ థీమ్, డైనోసార్ థీమ్ చూసాము ఇప్పుడు కొత్తగా స్పేస్ థీమ్ తో వస్తున్నాము. ఐదు సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వరకు ఉన్న చాలామందికి స్పేస్ ఫాంటసీ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కొత్త డిజైన్ తో సరికొత్త రుచులను అందిస్తున్నామని తెలిపారు.

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

12 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago