డేటా అనలిటిక్స్ప వర్క్షాప్

politics

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 మంది బీటెక్ సీఎస్ఈ , బీఫార్మశీ విద్యార్థులు పాల్గొని , ఇన్నోవియన్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్టు ఆమె తెలియజేశారు . వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి పోటీలను నిర్వహించి విజేతలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను పంపిణీ చేశామన్నారు . ఈ కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు ఆరూడియో వినియోగం , ఆర్ ప్యాకేజిని ఉపయోగించడంతో పాటు రియల్టైమ్ ప్రాజెక్టులయిన కోవిడ్ , జొమాటో డేటాలను విశ్లేషించినట్టు అరుణశ్రీ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *