ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
పటాన్చెరు
పటాన్చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు త్వరలోనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణ యాదవ్, పవన్, మైపాల్ రెడ్డి, రవి ,రాజు, వీరేశం ,అనిల్, కృష్ణ ,నరసింహ, శంకర్, ఇస్నాపూర్, పటాన్చెరు రామచంద్రాపురం, లింగంపల్లి ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.