politics

బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులు

పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ కార్మికుల ప్రదర్శన

అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు

సంఘీభావ సభలో వక్తలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

బిస్లైన పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని, చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో కార్మికుల భారీ ప్రదర్శన నిర్వహించారు.పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ అధ్యక్షతన సంఘీభావ సభను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, జిల్లా కోశాధికారి కే రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి, పి.భాగారెడ్డి మాట్లాడుతూ బిస్లి యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకోవడమే నేరమా అని ప్రశ్నించారు.

శాంతియుతంగా గత 45 రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమన్నారు. పట్టుదలతో పోరాడుతున్న బిస్లరీ కార్మికులకు జేజేలు అని అన్నారు. బిస్లరీ కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. బిస్లరీ కార్మికులకు మద్దతుగా జిల్లాలోని కార్మికులను కదిలించి పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, యజమాన్యం దిగివచ్చి చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు.సంఘీభావ కార్మికుల ప్రదర్శన సభలో వివిధ యూనియన్లు నుండి మద్దతు లభించింది.

సాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, కిర్బి ఉపాధ్యక్షులు మల్లేష్, సెనర్జీ జనరల్ సెక్రెటరీ శాంత్ కుమార్, సిబిఎల్ జన సెక్రటరీ ప్రసన్న, కోహెన్స్ ఫార్మా జనరల్ సెక్రెటరీ వెంకటేష్, పార్లే జన సెక్రెటరీ సంతోష్ గౌడ్, నీయఫ్ నాయకులు శంకర్, హిమ్ జల్ దామోదర్, టిఐడిసి వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు రాజు, కార్యదర్శి నాగభూషణం సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ నాయకులు విట్టల్, తలారి శ్రీనివాస్, జైపాల్, మహేశ్వర్ రెడ్డి, లకన్, చంద్రయ్య, ప్రభు, బిస్లరి యూనియన్ జన సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నవీన్, నాగరాజు, ప్రవీణ్, సతీష్, అజయ్ వివిధ యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

21 hours ago