మనవార్తలు ,పటాన్ చెరు
సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవేందర్ రాజు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు .