డబల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలి _మాజీజడ్పీటీసీ   గడిలశ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు,పటాన్ చెరు:

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ   గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు .

 

డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని వెల్లడించాలని ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎంత మంది పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారని నిరుపేదలైన స్థానికులకు మరియు దశాబ్దాలుగా స్థానికంగా స్థిరపడిన నిరుపేదలకు అందించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఎప్పుడు అందుబాటులోకి తేస్తారో  రాష్ట్ర ప్రజలకు తెలపాలని లేదంటే డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలని  లేదంటే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు పెద్ద ఎత్హున ఉద్యమిస్తామని గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, శ్రీనివాసగుప్త అసెంబ్లీ కన్వీనర్, దేవేందర్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, బైండ్ల కుమార్ జిల్లా కార్యాదర్శి, శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి, పుణ్యవతి మహిళ మోర్చా జిల్లా, జన్సీ మండల నాయకురాలు, జగన్ రెడ్డి, బాలచారీ, మధుకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *