Telangana

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం అభివృద్ధిలో ప్రతీకగా తీర్చిదిద్దుతాం

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం.. అభివృద్ధిలో ప్రతీకగా తీర్చిదిద్దుతాం

బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల లో సుడిగాలి పర్యటన

త్వరలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : 

అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం ఉదయం అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని తులసివనం కాలనీ, భ్రమరాంబిక నగర్ కాలనీ, ఏ ఆర్ బృందావన్ కాలనీ, కె ఎస్ ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, టైలర్ కాలనీ, ఎన్ ఎస్ ఎల్ కాలనీ, ఎన్ బి ఆర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీలలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు.

నేరుగా ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, యూజిడీలు, విద్యుత్, తాగు నీరు తదితర అంశాలపై చర్చించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించి నిర్దేశించిన గడువుగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.అమీన్పూర్ పరిధిలో దశాబ్దాల కాలంగా అపరిస్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడంతో పాటు.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలకు సైతం అందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.కాలనీలలో ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జాలు గురికాకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.పారిశుద్ధ్య విషయంలో ప్రజలకు ఇబ్బందులకు తలెత్తకుండా నూతన సిబ్బందిని సైతం నియమిస్తున్నట్లు తెలిపారు.నూతన కాలనీలు ఏర్పడడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని,ఇందుకు అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లతోపాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడటం తన నైజం అని మిగతా సమయం ప్రజల అభివృద్ధి సంక్షేమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అభివృద్ధిలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అవసరమైన నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.అతి త్వరలో బీరంగూడలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనన్నట్లు తెలిపారు.తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ఎమ్మెల్యేనే స్వయంగాతమ కాలనీలకు రావడం పట్ల ఆయా కాలనీల ప్రతినిధులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు బాలరాజు, కృష్ణ, యూనుస్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్ డిఈ వెంకటరమణ, జలమండలి డిజిఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏడి సంజీవ్, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago