ప్రతి ఒక్కరి కృషితోనే విజయం సాధించాం_పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

_ప్రభుత్వంలో లేకున్నా ప్రగతి పథంలో ముందుకెళ్తాం

_హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, శంకర్ యాదవ్, సపాన దేవ్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించాలని, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నమ్మి అధికారం అప్పచెప్పారని, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు మాత్రం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమానికి పట్టంకట్టి మూడోసారి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికిని కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారుత్వరలో జరగనున్న స్థానిక సంస్థలు పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా విజయానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో గాలి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *