ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

దేశంలో 13 కోట్ల ఓట్లను బీజేపీ మోదీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఓటరు జాబితా నుండి తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే విధుల నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరు జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు .సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి మాట్లాడుతూదేశంలో బీజేపీ మోదీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను ఆటబొమ్మగా మార్చి, తనకు అనుకూలమైన ఓట్లను జాబితాలో ఉంచి, వ్యతిరేక ఓట్లను తొలగిస్తూ ఆరు రాష్ట్రాల్లో ఓటు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.

అలాగే పటాన్ చెరు నియోజకవర్గంలోనే 39% అంటే సుమారు లక్ష ఓట్లను తొలగించి, ప్రజల ఓటు హక్కును కాలరాసి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.ఆరు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓటు చోరీతో సహాయం చేశారని, దేశంలో సుమారు 9 కోట్ల యువత నిరుద్యోగంతో రోడ్లెక్కుతున్న పరిస్థితిలో, బీజేపీకి తెరవెనుక నుండి ఎన్నికల కమిషనర్ మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ ను పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు రవి ముదిరాజ్, యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, కార్మిక సంఘం నాయకులు రాజు, రతన్ సింగ్, వినోద్, మల్లేష్, యువజన కాంగ్రెస్ నాయకులు అశోక్ నాయక్, అక్షిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *