మియాపూర్‌లో వినాయక చవితి ముగింపు వేడుకలు

politics Telangana

అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, ఆరోబిందో కాలనీల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్:

మియాపూర్ పరిధిలోని దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, ఆరోబిందో కాలనీలలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మరియు ఉత్సాహభరిత కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, TPCC జనరల్ సెక్రటరీ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ , మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ , వ్యవస్థాపకులు & చైర్మన్ – యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్, ఆయా ఉత్సవ కమిటీలు మరియు సంఘాల ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం మరియు సర్వశ్రేయస్సు కలగాలని శ్రీ వినాయక స్వామివారిని ప్రార్థించారు.ఆరోబిందో కాలనీలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు వేడుకలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఆరోబిందో గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో లోకేష్, రమేష్, సురేష్ మరియు కమిటీ సభ్యులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతించారు.ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, రవి గౌడ్, శంకర్, మూర్తి, మధు, వంశీ, ప్రణీత్, ప్రవీణ్ తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక నివాసితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *