సంగారెడ్డి:
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .బుధవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించతలపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనిపెరుగుతున్న కాలనీలు జనాభాకు అనుగుణంగా కాలనీలలో అవసరమైన పనులను గుర్తించి, ప్రాధాన్యత ప్రకారం పనులు చేపడుతున్నామన్నారు.
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సమిష్టి కృషితో చిట్కుల్ గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరుస్తున్నట్టు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు, భుజంగం, శ్రీను, దుర్గయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.