బచ్చుగూడలో ప్రజా పాలన విజయోత్సవాలు

politics Telangana

ప్రజా అవసరాల పరిష్కారమే మా ఎజెండా_ కాట శ్రీనివాస్ గౌడ్

ఇచ్చిన హామీలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం బచ్చుగూడ గ్రామపంచాయతీ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్టు సాయి కుమార్, నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ గార్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని విడతల వారీగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేశామని, సంక్రాంతి సందర్భంగా పెట్టుబడి సహాయమైన రైతు భరోసాను సైతం జమ చేస్తామని తెలిపారు. పదేండ్ల పాటు గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనను తెలంగాణ అస్తిత్వానికి జరిగిన అన్యాయాన్ని సరి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోందని దశలవారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా మార్చుతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాణి, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *