Telangana

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వారాహి మాత నవరాత్రి పూజలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పఠాన్ చేరు నియోజకవర్గం, అమిన్ పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు, అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొమ్మిది రోజులు అత్యంత శక్తివంతమైన ‘వారాహి నవరాత్రులు’ వారాహీ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా ఆరాధించే పర్వదినాలివి.

​అమ్మవారి అలంకార విశేషాలు
​ఎర్రటి వస్త్రాలు,ఎర్ర పూలు వారాహీ మాత ఉగ్ర మరియు శాంత స్వరూపిణి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎర్రటి లేదా పసుపు రంగు పట్టు వస్త్రాలు సమర్పించి, ఎర్రమందారాలు, గులాబీలు మరియు కనకాంబరాల మాలలతో అద్భుతంగా అలంకరిస్తారు.​పసుపు, కుంకుమల అర్చన: అమ్మవారిని రోజూ పసుపు, కుంకుమ మరియు గంధంతో సర్వాంగ సుందరంగా శృంగారించి కుంకుమార్చనలు నిర్వహిస్తారు.​శాకాంబరీ అలంకారం: ఆషాఢ నవరాత్రులలో పండ్లతో, రకరకాల తాజా కూరగాయలతో అమ్మవారిని ‘శాకాంబరీ దేవి’ రూపంలో అలంకరించడం అత్యంత విశేషం.
​వివిధ రూపాలు (నవ అలంకారాలు): తొమ్మిది రోజులు అమ్మవారిని 1}ఆది వారాహి,2}బృహద్ వారాహి, 3}స్వప్న వారాహి, 4}ధూమ్ర వారాహి, 5}కిరాత వారాహి,6} ఉన్మత్త వారాహి, 7}లఘు వారాహి, 8}అశ్వారూఢ వారాహి,9} మహా వారాహి వంటి వివిధ శక్తుల రూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు. భక్తులు వందలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, ప్రతిరోజు దేవాలయంలో ప్రచారకర్త డాక్టర్ మహంతయ్య శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహించారు, రేపు ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ కమిషనర్ పిలుపు మేరకు వరుణ యాగం మరియు వరుణ హోమం నిర్వహించబడుతుంది, యాగం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండి అందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్,ఆలయ ఈవో దేవనాదం, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

24 hours ago