విశ్వవిద్యాలయాలు జ్ఞాన కేంద్రాలుగా ఉండాలి: ప్రొఫెసర్ తిలక్

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విశ్వవిద్యాలయాలు కర్మాగారాలుగా కాకుండా జ్ఞాన సముపార్జన కేంద్రాలుగా ఉండాలని, 2020 జాతీయ విద్యా విధానాన్ని ఉటంకిస్తూ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇండియా పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ జంధ్యాల బి.జి, తిలక్ చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయన ‘విశ్వవిద్యాలయాలు: అంతరించిపోతున్న జాతులు?’ అనే అంశంపై అతిథ్య ఉపన్యాసం చేశారు. విజ్ఞాన వృద్ధిని పెంపొందించడానికి, మేధో ఉత్తేజాన్ని అందించడానికి విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని అధ్యాపకులు, విద్యార్థులకు ఆయన నొక్కి చెప్పారు. పరిపుష్టమైన ఆర్థిక వనరులు, అధ్యాపకులకు నుంచి నేతనాలు విశ్వవిద్యాలయాలను పునరుజ్జీవింపజేయడంలో తోడ్పడతాయన్నారు. అధ్యాపకులు నియామకంలో వెవిధ్యం ఉండాలని, వారు విద్యార్థులతో మమేకం కావాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అలాగే వ్యక్తులు, సమాజం.రెండింటికీ అధిక రాబడినిచ్చే ప్రజా ప్రయోజనంగా ఉన్నత విద్యలో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. తొలుత, జీఎస్ హెచ్ఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని పరిచయం చేయగా, కార్యక్రమ సమన్వకర్త డాక్టర్ దీప్పిఖా సాహూ వందన సమర్పణతో ముగిసింది. ఈ ఆతిథ్య ఉపన్యాసానికి అటు అధ్యాపకులు, ఇటు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రొఫెసర్ తిలక్ వారి సందేహాలను నివృత్తి చేయడమే గాక, విశ్వవిద్యాలయాల భవిష్యత్తుపై లోతైన అవగాహనను కల్పించారు. సోషియాలజీ విభాగం క్లిష్టమైన ఆలోచనలను ప్రేరేపించే, ముఖ్యమైన సామాజిక సమస్యలపై అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహించడం అనవాయితీగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *