పటాన్‌చెరులో జర్నలిస్టు యూనియన్ ల నూతన కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక

politics Telangana

*జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం*

టీయూడబ్ల్యూజే- హెచ్ 143 అధ్యక్షుడిగా ధూళిపాళ్ల రాఘవరెడ్డి
 ప్రధాన కార్యదర్శిగా అంతారం మహేష్‌గౌడ్

-తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడిగా గోకర్ శేఖర్‌గౌడ్  ప్రధాన కార్యదర్శిగా చింతల రామకృష్ణ

-ఐదు మండలాల జర్నలిస్టుల సమష్టి నిర్ణయం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టులు మరో అడుగు ముందుకేశారు. నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల, అమీన్‌పూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు సమష్టిగా నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే-హెచ్ 143 పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ధూళిపాళ్ల రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అంతారం మహేష్‌గౌడ్ ఎన్నిక కాగా.. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోకర్ శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చింతల రామకృష్ణ ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జర్నలిస్టులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పదవులను అలంకారప్రాయంగా కాకుండా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, అవసరమైనసందర్భాల్లో రాష్ట్ర, జిల్లా కమిటీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ అంశాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతోపాటు, వృత్తిలో ఎదురయ్యే సమస్యలపై సమష్టిగా స్పందిస్తామని తెలిపారు. ప్రతి జర్నలిస్టు భాగస్వామ్యంతో యూనియన్ లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఐదు ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు నూతన కార్యవర్గాలకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను సమష్టిగా పరిష్కరించేందుకు నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిన్నారం, గుమ్మడిదల, అమీన్‌పూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *